: కేబినెట్ సెక్రటరీ పదవీకాలం 6 నెలలు పొడిగింపు


కేంద్ర కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజిత్ సేథ్ ఈ నెల 13న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, అజిత్ సేథ్ పనితీరు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో, ఆయన సేవలను మరింతకాలం పాటు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అజిత్ సేథ్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News