: విద్యావంతులైన అబ్బాయిలు, అమ్మాయిలు భార్యాభర్తలుగా విఫలమవుతున్నారట!


ప్రస్తుత సమాజంలో చదువుకున్న అబ్బాయిలు, అమ్మాయిలు భార్యాభర్తల పాత్రల్లో విఫలమవుతున్నారని గోవా గవర్నర్ మృదులా సిన్హా అన్నారు. అంతేగాకుండా, సమర్థవంతమైన తల్లిదండ్రులుగా కూడా వ్యవహరించలేకపోతున్నారని తెలిపారు. విలువలు కలిగిన విద్య కావాలని సిన్హా నొక్కి చెప్పారు. ఈ మేరకు గోవా యూనివర్శిటీలో విద్యార్థులు, సిబ్బందితో నిర్వహించిన పరస్పర చర్చా కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆమె పైవిధంగా అభిప్రాయపడ్డారు. "కుటుంబ విలువలు వేగంగా భ్రష్టు పట్టిపోతున్నాయి. విద్యావంతులైన అమ్మాయిలు, అబ్బాయిలు భార్యాభర్తలుగా తమ పాత్రలను సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. తల్లిదండ్రులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది" అని ఆమె పేర్కొన్నారు. అయితే, వివాహానికి ముందు ఓ కౌన్సెలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలని, విలువ ఆధారిత విద్య తరహాలో పూర్తిగా మార్చివేయాలని ఆమె సలహా ఇచ్చారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో పోటీపడే విధంగా మన దేశంలోని విశ్వవిద్యాలయాలు తమ విద్యా ప్రమాణాలను నవీకరించాలని, మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలని కోరారు. విలువలతో కూడిన విద్యను అందించడానికి ప్రస్తుతమున్న విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన తక్షణ అవసరం వుందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News