: క్రికెట్ 'ఫాస్ట్' అయింది... 'పాసింజర్'లకు స్థానం లేదు: గవాస్కర్


సీనియర్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గంభీర్, జహీర్ ఖాన్ లను 2015 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ నుంచి తొలగించడాన్ని సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చారు. ప్రస్తుతం క్రికెట్ 'ఫాస్ట్' అయిందని, ఈ గేమ్ లో ఇక 'పాసింజర్'లకు స్థానం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఈ ఆటగాళ్ళు దేశవాళీ పోటీలలో పాల్గొని ఏమంతగా రాణించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీరు బరిలో దిగిన చివరి 5 మ్యాచ్ లలో ప్రదర్శన కూడా అసంతృప్తికరంగానే ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News