: బిజినెస్ క్లాస్ టికెట్ పై కేజ్రీవాల్ దుబాయ్ వెళ్లడంపై వివాదం


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ టికెట్ పై దుబాయ్ కు విమానంలో వెళ్లడంపై వివాదాస్పదంగా మారింది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ 'ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తి'గా కేజ్రీని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు సదరు సంస్థ ఆహ్వానించింది. ఆ అవార్డు కార్యక్రమానికి వెళ్లేందుకే ఆయన దుబాయ్ పయనమయ్యారు. కేజ్రీ తన బిజినెస్ సీటులో ఉన్న సమయలో ఓ ప్రయాణికుడు కలసి ఫోటో తీసుకున్నాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ లో పెట్టాడు. అది కాస్తా ప్రతిపక్షానికి అవకాశంగా మారింది. 'ఆమ్ ఆద్మీ' కోసం అంటూనే బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తారా? అని రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ, "ఈ విషయం ఏఏపీ రెండు రకాల వైఖరికి అద్దం పడుతుంది. వారి ఎన్నికల ప్రచారం కోసం ఓ చేత్తో ప్రజలను విరాళాలు అడుగుతూ, మరో చేత్తో బిజినెస్ క్లాస్ లో ప్రయాణాలు చేస్తున్నారు. ఎకానమీ క్లాస్ లోనే వెళ్లాలని కేజ్రీకి మేము చెప్పినా తిరస్కరించారు. పొదుపు చర్యలు పాటించాలని ఓ పక్క ఏఏపీ చెబుతుండగా, కేజ్రీ అలా ప్రయాణం చేయడం సరైంది కాదు" అని అన్నారు. వెంటనే ఆరోపణలను ఖండించిన ఆప్, కేజ్రీవాల్ టికెట్ నిర్వాహకులు స్పాన్సర్ చేసిందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News