: కంటి ఆపరేషన్ చేయించుకుంటే కన్నే పోయింది
వారంతా కంట్లో ఏర్పడిన శుక్లాలను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అందరూ 60 ఏళ్ల పైబడినవారే. 50 మందికి ఆపరేషన్ లు చేయగా 14 మందికి పూర్తిగా కంటిచూపు పోయింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఓ ఎన్జీఓ నిర్వహించిన ఐ క్యాంపులో ఈ ఘటన జరిగింది. చూపు కోల్పోయిన వారిని అమృతసర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చమని, విచారణకు ఆదేశించామని అమృతసర్ డిప్యూటీ కమిషనర్ రవి భగత్ తెలిపారు.