: స్వచ్ఛ భారత్ ప్లెక్సీని తొలగించిన వైకాపా... అడ్డుకున్న టీడీపీ
కృష్ణా జిల్లా పోరంకిలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో స్వచ్ఛ భారత్ ఫ్లెక్సీని తొలగించేందుకు వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారథి వర్గీయులు యత్నించగా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. అంతేకాక నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ కుల దూషణలకూ దిగారు. దీంతో అటు పార్థసారథితో పాటు బోడె ప్రసాద్ పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.