: కల్యాణ్, నేనూ ఒకే మాటమీద ఉంటాం...నా పైన కల్యాణ్ కి ఎన్ని కంప్లైంట్లో!: రేణూదేశాయ్
పిల్లల్ని పెంచడంలో పవన్ కల్యాణ్, తాను ఒకే మాటమీద ఉంటామని రేణూదేశాయ్ చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు కోణాల్ని ఆవిష్కరించిన రేణూ, తమ పిల్లల్ని సాధారణంగా పెంచాలని నిర్ణయించామని తెలిపింది. పూణేలో చదువుతున్న అకీరా, ఆద్యను స్టార్ పిల్లలుగా కాకుండా మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పింది. తనపై తమ కుమార్తె ఆద్య ఎన్నో కంప్లైంట్లు కల్యాణ్ కి ఇస్తుందని రేణూ చెప్పింది. తనకి వాచ్ కావాలని, అమ్మ కొనవ్వడం లేదని, ఇలా ఏదో ఒకటి వాళ్ల నాన్నకు చెబుతూనే ఉంటుందని రేణూ చెప్పింది. కల్యాణ్ కూడా ఎందుకు నాన్నా? అంటూ ఆద్యకు అర్థమయ్యేలా చెప్పి, వద్దని ఒప్పిస్తారు. 'అమ్మ చెప్పిందే కరెక్ట్' అని చెబుతారు. పిల్లల్ని పెంచడం విషయంలో తమిద్దరిదీ ఒకే మాటని రేణూదేశాయ్ వివరించింది.