: నేనందుకున్న పుట్టిన రోజు కానుకల్లో అత్యంత విలువైనది అదే!: రేణూదేశాయ్
తనకు పుట్టిన రోజు ఆడంబరంగా జరుపుకోవడం పెద్దగా ఇష్టం ఉండదని పవన్ కల్యాన్ మాజీ భార్య, నటి, నిర్మాత రేణూదేశాయ్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన పుట్టిన రోజు బహుమతుల్లో ఏది విలువైనది? అని అడిగిన ప్రశ్నకు ఆమె తన కుమారుడు అకీరా నందన్ ఇచ్చిన గిఫ్టే విలువైనదని తెలిపారు. "నాలుగేళ్ల వయసులో అకీరా అప్పుడే నేర్చుకుంటున్న అక్షరాలతో క్రేయాన్స్ తో 'ఐ లవ్యూ మమ్మీ' అని ఓ గ్రీటింగ్ కార్డు రాసి, గార్డెన్ లోకి వెళ్లి కొన్ని పూలు కోసుకొచ్చి హ్యాపీ బర్త్ డే చెప్పాడు. అదే అత్యంత విలువైన బర్త్ డే గిఫ్ట్" అని రేణూదేశాయ్ తన్మయంగా చెప్పుకొచ్చింది. ఆ క్షణంలో కన్నీళ్లు వచ్చాయని, ఆనందంతో ఏడ్చానని చెప్పింది.