: గ్వాలియర్ లో తెలుగు విద్యార్థి అదృశ్యం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఐఐఐటీ మూడో ఏడాది చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రవీణ్ కుమార్ అదృశ్యమయ్యాడు. మంగళవారం నుంచి ప్రవీణ్ కుమార్ కనిపించడం లేదు. దీంతో ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రవీణ్ కుమార్ స్వస్థలం విశాఖపట్టణంలోని మద్దిలపాలెం.