: జనవరిలో కేసీఆర్ అమెరికా పర్యటన!


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరిలో అమెరికాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. అందుకు అవసరమైన డిప్లొమాట్ వీసాకు దరఖాస్తు చేసేందుకు ఆయన నేటి మధ్యాహ్నం అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. అయితే, అమెరికా పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జనవరిలోనే ఒబామా భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను కొత్త రాష్ట్రానికి ఆహ్వానించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఆయన పర్యటనలో హైదరాబాదుకు చోటు కల్పించాలని దౌత్య అధికారులను కేసీఆర్ కోరినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News