: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలు మారిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్, టీడీపీలు గట్టిగా పట్టుబట్టాయి. టీడీపీ ప్రత్యేకంగా, తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేసింది.