: తెలంగాణ గనులు వైజాగ్ స్టీల్స్ కు కేటాయింపు సరికాదు: నారాయణ
తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఈ ప్రాంత గనులను వైజాగ్ స్టీల్స్ కు కేటాయించడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగానే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి అవసరాలకు పోను.. మిగతా నిక్షేపాలను కేటాయించవచ్చన్నారు. వైజాగ్ స్టీల్స్ కు కావాలంటే ఓబుళాపురం గనులను కేటాయించవచ్చని సూచించారు.