: పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ ను మార్చుతాం: కేటీఆర్
తరగతి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులపై చట్టం తీసుకొచ్చే యోచనలో ఉన్నామని... పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ లో మార్పులు చేర్పులు తీసుకొస్తామని టీఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. వృత్తి విద్యకు సంబంధించిన సిలబస్ మార్పుపై ఈ రోజు సచివాలయంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పై వివరాలను వెల్లడించారు.