: దేశానికి మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేసిన సేవలు ఎనలేనివి: మోదీ
మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ దేశానికి ఎనలేని సేవ చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు ఆయన 104వ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో "మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ కు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండి భారత్ ఉన్నతి కోసం ఆయన అవిరామంగా కృషి చేశారు" అని చెప్పారు. డిసెంబర్ 4, 1910లో జన్మించిన వెంకట్రామన్ దేశ ఎనిమిదవ రాష్ట్రపతిగా జులై 25, 1987 నుంచి జులై 25, 1992 వరకు పని చేశారు.