: మళ్లీ మెరిసిన ఆరోన్... ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎలెవన్ విలవిల


రెండ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియా పేసర్ వరుణ్ ఆరోన్ (3 వికెట్లు) మరోసారి నిప్పులు చెరిగాడు. పేస్ కు విశేషంగా సహకరిస్తున్న అడిలైడ్ పిచ్ పై ఆస్ట్రేలియా ఎలెవన్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. దీంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు ప్రస్తుతం 7 వికెట్లకు 193 పరుగులు చేసింది. కాగా, తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ తొలి రోజు ఆటలో బరిలోకి దిగకపోవడంతో, అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఆట ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు హ్యూస్ మృతికి సంతాపంగా ఓ నిమిషం పాటు మౌనం పాటించారు.

  • Loading...

More Telugu News