: పాదచారులపైకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్... భరత్ నగర్ లో వ్యక్తి మృతి


నిన్న విశాఖ, నేడు హైదరాబాద్... పాదచారులపైకి దూసుకెళ్లిన వాహనాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ లోని భరత్ నగర్ లో అదుపు తప్పిన వాటర్ ట్యాంకర్ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బుధవారం విశాఖలోనూ ఇదే తరహాలో అదుపు తప్పిన ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

  • Loading...

More Telugu News