: మన దగ్గరే కాదు... చైనాలోనూ హైటెక్ కాపీయింగ్ జరుగుతోంది!


మన దగ్గర వివిధ పరీక్షల్లో అభ్యర్థులు, విద్యార్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ జాఢ్యం మన దగ్గరే కాదు, అనేక దేశాల్లోనూ కొనసాగుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టు దేశం చైనాలోనూ ఈ వ్యవహారం తలనొప్పిగా అవతరించింది. హైటెక్ కాపీయింగ్ కు అక్కడ 'జేమ్స్ బాండ్ 007 స్టైల్' అని పేరు పెట్టారు. పరీక్షలకు హాజరవుతున్న యువతులు తమ బ్రాలలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పెట్టుకుని వస్తున్నారు. వైర్ లెస్ పిన్ వ్యవస్థ ఉన్న పిన్ హోల్ కెమెరాలతో ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపుతున్నారు. అదే పద్ధతిలో సమాధానాలను కూడా తెప్పించుకుంటున్నారు. కళ్లజోళ్లు, ఎరేజర్స్, పెన్సిళ్లు, వాచీలు ఇలా రకరకాలుగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. అంతేకాదు, వీటిని ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వ్యాపారులే నేర్పుతున్నారు. అమెరికాలో పైచదువులకు వెళ్లడానికి నిర్వహించే ఎస్ఏటీ (శాట్) పరీక్షలలో ఇలాంటి కాపీయింగ్ కు చైనా యువత ఎక్కువగా పాల్పడుతోందట.

  • Loading...

More Telugu News