: శరద్ పవార్ కు ఢిల్లీలో ఆపరేషన్!
ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోనున్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో జారిపడ్డ పవార్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం ఆయనను బుధవారమే హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పవార్ కు ఎక్స్ రే తీసిన వైద్యులు కాలికి గాయమైనట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పవార్ కు ఆపరేషన్ చేయించనున్నట్లు ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇందుకోసం పవార్ ను తిరిగి ఢిల్లీ తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే, పవార్ ను బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బ్రీచ్ క్యాండీలో పరామర్శించారు.