: నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా: నారా లోకేష్ కు టీఆర్ఎస్ సవాల్


ఆరు నెలల పరిపాలనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం తప్ప టీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ వ్యాఖ్యానించడంపై టీఆర్ఎస్ భగ్గుమంది. గురివింద గింజలాగ తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా... టీఆర్ఎస్ పై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పై టీడీపీ పదేపదే విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు తాను, తమ ఎంపీ బూర నర్సయ్య సిద్ధమని చెప్పారు. లోకేష్ కు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News