: ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తాం: గంటా


ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం రెండు రాష్ట్రాల మధ్య అగాధాన్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలో, పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు చివరి వరకు యత్నిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ అమలుకు తాము సిద్ధమేనని... అయినా టీఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News