: 'ముకుంద' ఆడియో ఆవిష్కరించిన చిరంజీవి
'ముకుంద' సినిమా ఆడియోను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ముకుంద ఆడియోను ఆవిష్కరించి, అల్లు అర్జున్ కు ఇవ్వాలని నిర్వాహకులు కోరగా, అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించి, ఆ సీడీని సిరివెన్నెలకు ఇస్తే సముచితంగా ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఆడియో సీడీని ఆవిష్కరించి సిరివెన్నెలకు అందజేశారు. అనంతరం అల్లు అర్జున్ కు అందజేశారు.