: ఆటలో నిన్ను చూసుకుంటాం... హ్యూస్ అంత్యక్రియల వేళ క్లార్క్ కన్నీటిపర్యంతం
బౌన్సర్ తగిలి మరణించిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు అతని స్వస్థలం మాక్స్ విల్లేలో పూర్తయ్యాయి. హ్యూస్ కడసారి చూపులకు వేలాది మంది తరలివచ్చారు. సహచరుడి అంత్యక్రియలకు హాజరైన ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి కన్నీటి పర్యంతమయ్యాడు. నివాళి ప్రకటన చదువుతూ ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచుకోవడంలో విఫలమయ్యాడు. "మై లిటిల్ బ్రదర్... నీ ఆత్మకు శాంతి కలుగుగాక. భౌతికంగా నువ్వు లేకపోయినా, ఇకమీదట నిన్ను ఆటలో చూసుకుంటాం" అని పేర్కొన్నాడు. హ్యూస్ అంతిమయాత్ర సందర్భంగా క్లార్క్ 'పాల్ బేరర్' (అంత్యక్రియలకు సహకరించే వ్యక్తి) గా వ్యవహరించాడు.