: చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులో పొగలు


రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. బస్సులో పొగలు అలముకున్నాయి. దీంతో, ఆయన వేరే వాహనంలోకి మారారు. పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు రాజమండ్రిలో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి హెలికాప్టర్ లో వెళ్లిన బాబు... స్థానిక మధురపూడి విమానాశ్రయం నుంచి బస్సులో బయలు దేరారు. ఈ సమయంలో బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది.

  • Loading...

More Telugu News