: హ్యూస్ కు ప్రధాని మోదీ నివాళి
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మోదీ ట్విట్టర్ లో తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "అందరి హృదయాలను కలచివేస్తూ ఆస్ట్రేలియాలో హ్యూస్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. హ్యూస్...నిన్ను మిస్సవుతున్నాం. నీ ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నావు. నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అంటూ మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.