: రఘువీరా వ్యాఖ్యలు... దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: రావెల


ఆంధ్రప్రదేశ్ పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు మండిపడ్డారు. దళితుల సంక్షేమంపై రఘువీరారెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన బుధవారం విజయవాడలో అన్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమాన్ని నీరుగార్చిన పార్టీ కాంగ్రెస్సేనని ఆయన రఘువీరాపై నిప్పులు చెరిగారు. దళితుల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రఘువీరాకు రావెల సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News