: బౌన్సర్లను నిషేధిస్తే ఆటలో మజానే పోతుంది: సెహ్వాగ్


ఓ భీకర బౌన్సర్ దెబ్బకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. అంతేకాకుండా, క్రికెట్ ఆటలో ప్రమాదకరమైనవిగా భావించే బౌన్సర్లను నిషేధించాలనే వాదన కూడా ప్రారంభమయింది. దీనిపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. బౌన్సర్లు ప్రమాదకరమే కావచ్చు... కానీ, వాటిని నిషేధిస్తే క్రికెట్లో మజానే పోతుందని అభిప్రాయపడ్డాడు. తన కెరీర్లో కూడా ఎన్నో బౌన్సర్లు తన హెల్మెట్ ను ముద్దాడాయని వీరూ చెప్పాడు. ఏ క్రీడలో అయినా ప్రమాదాలు ఉంటాయని... కొన్ని సందర్భాల్లో క్రీడాకారులను బలి తీసుకుంటాయని అన్నాడు. పేస్ బౌలర్ల ఆయుధమైన బౌన్సర్లను నిషేధిస్తే, క్రికెట్ మొత్తం పూర్తిగా బ్యాట్స్ మెన్ గేమ్ గా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు. బౌన్సర్లను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సిందే అని తెలిపాడు.

  • Loading...

More Telugu News