: తుపాకీ బుల్లెట్ల బ్యాగ్ మాయం


విశాఖపట్నం నుంచి ఒంగోలు వస్తున్న ఒక ఏఆర్ కానిస్టేబుల్ కు చెందిన సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్) బుల్లెట్ల బ్యాగ్ కనిపించకుండా పోయింది. దీంతో సదరు కానిస్టేబుల్ విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరైనా పొరపాటున బ్యాగ్ తీసుకెళ్ళారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News