: తెలంగాణకు ఓసీటీఎల్ గుడ్ బై... కృష్ణపట్నానికి నార్కట్ పల్లి ప్లాంట్!


తెలంగాణకు మరో పరిశ్రమ గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆయిల్ కంట్రీ టూబ్యులార్ లిమిటెడ్ (ఓసీటీఎల్)ను ఏపీకి తరలించేందుకు సదరు కర్మాగారం యాజమాన్యం కామినేని గ్రూపు సన్నాహాలు చేస్తోంది. కార్మికుల సహాయ నిరాకరణ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నందునే ఈ నిర్ణయం దిశగా అడుగులేయాల్సి వచ్చిందని కామినేని గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కామినేని వెల్లడించారు. ఏపీలోని విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాలను పరిశీలించామని, కృష్ణపట్నానికే ఓసీటీఎల్ ను తరలించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. చమురు, సహజ వాయువు నిక్షేపాల వెలికితీతలో వినియోగించే పైపులను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కార్మికుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తెలంగాణ సర్కారు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేని నేపథ్యంలోనే తరలింపు యోచన చేస్తున్నట్లు శశిధర్ కామినేని వెల్లడించారు.

  • Loading...

More Telugu News