: నేటి నుంచి ప్రత్యేకాధికారి పాలనలోకి జీహెచ్ఎంసీ


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకవర్గం పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ సహా కార్పొరేటర్లందరూ మాజీలు కానున్నారు. జీహెచ్ఎంసీ పాలన వ్యవహారాలు ప్రత్యేకాధికారి చేతుల్లోకి వెళ్లనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగుతున్న సోమేశ్ కుమార్ కే ప్రత్యేకాధికారి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమేశ్ కుమార్ ను జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ గా నియిమిస్తూ పురపాలక శాఖ మంగళవారమే ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికిప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించని నేపథ్యంలో ప్రత్యేకాధికారి పాలన తప్పలేదు. ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారి పాలనను విధిస్తూ నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

  • Loading...

More Telugu News