: రుణమాఫీకి జగనే అడ్డంకి: దేవినేని ఉమా
టీడీపీ ఎన్నికల హామీలో భాగమైన రైతు రుణమాఫీని ఏపీ ప్రభుత్వం ఇంత వరకు చేపట్టలేదంటూ ఓ వైపు వైకాపా అధినేత జగన్ ఈ నెల 5న మహాధర్నాకు సిద్ధమవుతుంటే... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం రివర్స్ గేర్ లో జగన్ పైనే విమర్శలు సంధించారు. జగన్ కు రుణమాఫీ జరగడం ఇష్టం లేదని... రుణమాఫీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ జరిగితే ఏపీలో టీడీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్నాలు, దీక్షలను జగన్ చేయాలనుకుంటే ఇడుపులపాయలో చేసుకోవచ్చని సూచించారు. ఏపీ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని... ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు.