: వాటికన్ వెళ్లిన 100 మంది కేరళీయుల మిస్సింగ్


క్రైస్తవుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీని దర్శించడానికి వెళ్లిన 100 మంది కేరళీయులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ ఇంత వరకు లభించలేదు. ఈ విషయాన్ని టూరిస్ట్ సంస్థలు కూడా స్పష్టం చేశాయి. మిస్ అయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని చెబుతున్నాయి. మిస్సింగ్ వ్యవహారంపై అక్కడి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపాయి. అయితే, వీరి మిస్సింగ్ వెనుక మరో కథనం కూడా వినిపిస్తోంది. ఇటలీలో ఉద్యోగాల కోసం వీరంతా రహస్య ప్రాంతాలకు వెళ్లి ఉంటారని కూడా కొంత మంది భావిస్తున్నారు. ఈ సీజన్ లో దాదాపు 1000 మంది కేరళ యాత్రికులు వాటికన్ సందర్శించారు. మిస్ అయిన వారి వీసా గడువు ముగియడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News