: రాంపాగోల్ వర్మ మత్తుమందులాంటి వాడంటున్న యువ నటుడు
విపరీత వ్యాఖ్యలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఇటీవల తీసిన చిత్రం 'ఐస్ క్రీమ్-2'. ఆ సినిమాలో నటించిన నందూ అనే యువ నటుడు వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, వర్మ ఓ మత్తుపదార్థం వంటివాడని, ఈజీగా అతనికి బానిసలమైపోతామని వివరించాడు. "వర్మతో కలిసి పనిచేయడం మొదలుపెడితే, బెరుకంతా పోతుంది. రాత్రివేళ ఆల్కహాల్ ను ఎలా తిరస్కరించలేమో, ఆ రీతిలో మనం ఆయన పట్ల ఆకర్షితులమవుతాం" అని పేర్కొన్నాడు. ఆర్జీవీతో తాను మరో కొత్త సినిమాకు అంగీకరించానని, అందులో తాను సోలో హీరోనని తెలిపాడు.