: కాశ్మీర్ లో ఎన్ కౌంటర్...ముగ్గురు తీవ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఓ వైపు రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు జరుగుతుండగానే, భారత భూభాగంలోకి చొరబడేందుకు ఎనిమిది మంది తీవ్రవాదులు యత్నించారు. కుప్వారా జిల్లా నౌగామ్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల దుశ్చర్యలను గమనించిన భద్రతా దళాలు వారిని నిలువరించే యత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం ప్రకటించింది.