: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో నేడు రెండో విడత పోలింగ్


జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండటంతో... భారీగా బలగాలను మోహరింపజేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు మధుకోడా, అర్జున్ ముండాలాంటి నేతలు నేటి బరిలో ఉన్నారు. మొత్తంమ్మీద 223 మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున భద్రతాదళాలు అలర్ట్ అయ్యాయి. ఉప సభాపతి, నలుగురు మంత్రులు, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు బరిలో ఉన్నారు. రెండో విడతలో మొత్తం 18 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 275 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News