: హైదరాబాదులో ఎబోలా కేసు... బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స?


ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న ఎబోలా వ్యాధి హైదరాబాదులోనూ అడుగుపెట్టినట్లు వెలువడిన వార్తలు జంట నగరాల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్యాధికారులు ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు. సదరు వ్యక్తికి ఎబోలా సోకిందని ఇప్పటిదాకా నిర్ధారణ కానప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా అతడికి వైద్య పరీక్షలన్నీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అంతేకాక అతడి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపినట్లు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News