: ఈ నెల 5న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5న జరగనుంది. రాష్ట్ర రాజధాని, ఇంటర్ పరీక్షలు, ఇంకా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 7న రాష్ట్రానికి సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ వస్తుండగా, 9న సింగపూర్ ప్రతినిధుల బృందం రానుంది. వారు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని నమూనాను వారికి అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది.