: ఉస్మానియా ఆసుపత్రిలో తెలంగాణ ఆరోగ్య మంత్రి రాజయ్య నిద్ర
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రించనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆయన ఆసుపత్రిలో గడపనున్నారు. ఈ సందర్భంగా రోగుల సమస్యలు, ఆసుపత్రిలో సౌకర్యాలు, ఇతర సమస్యల గురించి స్వయంగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే రాజయ్య ఇలా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రకు సిద్ధమయ్యారు.