: గ్రామీణ భారతావనిలో 59.4 శాతం కుటుంబాలకు బహిర్భూమే గతి: రాజ్యసభలో కేంద్రం
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 59.4 శాతం గృహాలలో మరుగుదొడ్లు లేవని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి రామ్ కపిల్ యాదవ్ రాజ్యసభకు తెలిపారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నివేదికను ఆయన పార్లమెంట్ ముందుంచారు. ఇప్పటివరకూ మరుగుదొడ్ల ఏర్పాటుకు 3 బిలియన్ డాలర్లను (సుమారు రూ.18,000 కోట్లు) వెచ్చించామని ఆయన తెలిపారు. 1981 లో 32.7 శాతం గృహాలకు లెట్రిన్ సౌకర్యం ఉండగా, 2012 నాటికి అది 40.6 శాతానికి పెరిగిందని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 2019 లోగా అందరికీ మరుగుదొడ్లు కట్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.1,34,386 కోట్ల వ్యయం కానుందని తెలిపారు.