: మెట్రో రైల్ లో ఉద్యోగాల పేరుతో వస్తున్న ప్రకటనలు నమ్మకండి: మెట్రో రైల్ ఎండీ


హైదరాబాదు మెట్రో రైల్ లో ఉద్యోగాల పేరుతో వస్తున్న పలు ప్రకటనలను నమ్మవద్దని మెట్రో రైల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి తెలిపారు. అవన్నీ అవాస్తవమని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది మోసం చేస్తున్నారని, క్యాంపస్ నియామకాల ద్వారానే ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు. ఇక, అఖిలపక్షం సమావేశం తరువాతే మెట్రో అలైన్ మెంట్ పై స్పష్టత ఇస్తామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

  • Loading...

More Telugu News