: భూమాకు ఫోన్ లో జగన్ పరామర్శ


తల్లి ఈశ్వరమ్మ చనిపోయి తీవ్ర బాధలో ఉన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు ఆయనకు ఫోన్ చేసి జగన్ ఓదార్చారు. భూమా కుటుంబానికి తన సంతాపాన్ని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న భూమా తల్లి ఈ ఉదయం హైదరాబాదులోని నివాసంలో మరణించారు. అంత్యక్రియలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News