: స్టాక్ మార్కెట్లలో విజయ్ మాల్యా సంస్థల షేర్ల లావాదేవీలు నిలిపివేత


ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన గ్రూపు సంస్థలకు చెందిన షేర్ల లావాదేవీలను బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లలో నిలిపివేశారు. కింగ్ ఫిషర్, యూబీ గ్రూప్ లకు సంబంధించి నమోదిత ఒప్పందాలను పూర్తిచేయని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, మంగుళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సంస్థ బోర్డు డైరెక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేశారు. అతని రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని మంగుళూరు కెమికల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో, ఈ సంస్థ షేర్ల విలువ వెంటనే 15 శాతం వరకు పెరిగింది.

  • Loading...

More Telugu News