: త్రిపురాంతకం వద్ద ప్రైవేట్ స్కూలు బస్సు బోల్తా... పది మంది విద్యార్థులకు గాయాలు
ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. జిల్లాలోని త్రిపురాంతకం మండలం గణపవరం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మిగిలిన వారంతా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.