: కేసీఆర్ సర్కార్ పై కోదండరాం పోరుబాట!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఆ పార్టీ ఆధ్వర్యంలోని సర్కారుపై సమరశంఖం పూరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు... ఉమ్మడి రాష్ట్రంలోని నాటి పాలకులకు తీసిపోని విధంగానే పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలకు సమయం ఆసన్నమైందని కూడా ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం జరిగిన తెలంగాణ విద్యావంతుల సదస్సు సందర్భంగా కోదండరాం ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంఘాల సమష్టి ఉద్యమం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను ఓపెన్ కాస్టులతో బొందలగడ్డలుగా మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ తరహా సర్కారు యత్నాలను ప్రజా పోరాటాల ద్వారానే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News