: స్టేజ్ ను ఊపేసిన అల్లు అర్జున్, రవితేజ, దేవీశ్రీప్రసాద్
హుదూద్ బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ మేము సైతం అంటూ నిర్వహించిన కార్యక్రమానికి స్నేహితులు దేవీశ్రీప్రసాద్, అల్లు అర్జున్ ఉత్సాహం, ఉల్లాసం తెప్పించారు. దేవీశ్రీప్రసాద్ తో గొంతు కలిపిన అల్లు అర్జున్ స్టేజ్ అదిరిపోయే స్టెప్పులేసి అందర్లోనూ ఉత్సాహం ఉరకలెత్తించారు. అల్లు అర్జున్, దేవీ పెర్ఫార్మెన్స్ చూసిన సినీ నటులంతా ఫిదా అయిపోయారు. అనంతరం దేవీశ్రీప్రసాద్, హీరో రవితేజను స్టేజ్ పైకి పిలిచి డాన్స్ చేయించారు.