: అలరించిన రవితేజ పాట...అల్లు అర్జున్ ఆట
తెలుగు సినీ పరిశ్రమ హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం మేము సైతం అంటూ చేపట్టిన కార్యక్రమాన్ని సినీ నటులు రక్తికట్టించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో తమన్ సంగీత విభావరిలో హీరో రవితేజ తన సినిమాలోని పాట పాడి అలరిస్తే, 'రేసుగుర్రం' అల్లు అర్జున్ తన సినిమాలోని 'సినిమా చూపిస్తా మామా' అంటూ సాగిన పాటలో ఓ స్టెప్పేసి ఉర్రూతలూగించారు. తమన్ పలు పాటలు పాడి అభిమానులను అలరించారు.