: మమతాబెనర్జీపై అమిత్ షా విమర్శల వాన


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. కోల్ కతాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. బుర్థ్వాన్ కేసు దర్యాప్తుకు మమతా బెనర్జీ అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. శారదా గ్రూప్ కుంభకోణం కేసులో తృణమూల్ నేతలే కీలక పాత్ర పోషించారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మమత ఆటంకం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. బంగ్లా చొరబాటుదారులకు మమత రక్షణ కల్పిస్తున్నారని అమిత్ షా విమర్శించారు.

  • Loading...

More Telugu News