: బొట్టు పెట్టు... ధాన్యం పట్టు... ఐకేపీ కార్యకర్తల సరికొత్త ప్రచారం!


ఐకేపీ కేంద్రాల్లో మాత్రమే ధాన్యం అమ్మాలంటూ డ్వాక్రా మహిళలు, రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి మరీ అడుగుతున్నారు. ఐకేపీ కేంద్రాల ప్రమోషన్ కోసమే ఇలా చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు, మంచిలి, కె. సముద్రపుగట్టు తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. సాధారణంగా పెళ్లి, పేరంటాళ్ల సందర్భంలోను, అదీ కాదంటే ఎన్నికలొచ్చినప్పుడు ఇంటింటికీ వెళ్లి ముత్తయిదువులకు బొట్టుపెట్టడం రివాజు. ఇలా ధాన్యం తమకే అమ్మాలంటూ మహిళలు తిరుగుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News