: దారి దోపిడీకి పాల్పడ్డ భావి ఇంజినీర్లు...అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ 10 మంది విద్యార్థులు మరికొన్ని రోజుల్లో ఇంజినీర్లుగా మారనున్నారు. వారంతా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు, కోట పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కళాశాలలో తరగతులకు హాజరు కావాల్సిన ఆ విద్యార్థులు దారి తప్పారు. దారి దోపిడీకి పాల్పడ్డారు. చివరకు కటకటాలపాలయ్యారు. వారం కిందట చిల్లకూరు మండలం గుత్తావారిపాలెం వద్ద పది మంది విద్యార్థులు కలిసి ఓ దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘనటపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఈ దోపిడీకి పాల్పడింది ఇంజినీరింగ్ విద్యార్థులని తేల్చారు. విద్యార్థుల దోపిడీని నిర్ధారించుకున్న పోలీసులు శనివారం ఆయా కళాశాలల్లో చదువుతున్న మొత్తం 10 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థుల నుంచి రూ.2 లక్షల నగదు, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.