: డిసెంబర్లో జీఎస్ఎల్వీ ఎంకే-3 ప్రయోగం
వచ్చే నెలలో జీఎస్ఎల్వీ ఎంకే-3 ప్రయోగానికి శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం (షార్) సిద్ధమవుతోంది. డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ ప్రయోగం ఉంటుందని షార్ డైరెక్టర్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భవిష్యత్తులో భారత గడ్డపై నుంచే ప్రయోగించే సామర్థ్యం ఇస్రో సొంతమవుతుంది. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భారీ ఉప్రగహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇంతకుముందు, జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్ ను అక్టోబర్ చివరివారంలో ప్రయోగించాలని భావించినా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో, ఆ ప్రయోగాన్ని డిసెంబర్ లో చేపట్టాలని ఇస్రో వర్గాలు నిర్ణయించాయి.