: ఈశాన్య భారతం అభివృద్ధి చెందేవరకు దేశం అభివృద్ధి కాదు: మోదీ
ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో నేటి నుంచి పర్యటించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ఈ మేరకు, "ఈశాన్య భారతం అభివృద్ధి అయ్యేవరకు దేశం అభివృద్ధి కాదు. అందుకే ఈశాన్య ప్రాంతాల సామర్థ్యాన్ని తెలుసుకుని, దాని పురోగతిని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం" అని పేర్కొన్నారు. అంతేగాక ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించేందుకు, అక్కడి వారిని కలసి మాట్లాడేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో యువత ప్రతిభ ఆ ప్రాంత అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.